నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం
తెలంగాణ శాసనసభ నియోజకవర్గం
దేశంభారతదేశం మార్చు
వున్న పరిపాలనా ప్రాంతంతెలంగాణ మార్చు
అక్షాంశ రేఖాంశాలు18°2′24″N 77°46′48″E మార్చు
పటం

ఇది భారతదేశ తెలంగాణ రాష్ట్రములోని సంగారెడ్డి జిల్లాలోని 5 శాసనసభ స్థానాలలో నారాయణ్‌ఖేడ్ శాసనసభ నియోజకవర్గం ఒకటి. ఇది జహీరాబాదు లోక్ సభ నియోజకవర్గ పరిధిలోనికి వచ్చును.[1]

నియోజకవర్గంలోని మండలాలు

[మార్చు]
  • మనూర్
  • నారాయణఖేడ్
  • కల్హేర్
  • శంకరంపేట్
  • సిర్గాపూర్
  • నాగలిగిద్ద
  • కంగ్టి

ఎన్నికైన శాసనసభ్యులు

[మార్చు]
ఇంతవరకు ఈ నియోజకవర్గం నుంచి గెలుపొందిన శాసనసభ్యులు[2]
సంవత్సరం గెలుపొందిన సభ్యుడు పార్టీ ప్రత్యర్థి ప్రత్యర్థి పార్టీ
1952 అప్పారావు షేట్కర్ కాంగ్రెస్ పార్టీ హెచ్.రావు సోషలిస్టు పార్టీ
1957 అప్పారావు షేట్కర్ కాంగ్రెస్ పార్టీ బి.శివలింగప్ప స్వతంత్ర అభ్యర్థి
1962 రాంచందర్‌రావు దేశ్‌పాండే స్వతంత్ర అభ్యర్థి అప్పారావు షేట్కర్ కాంగ్రెస్ పార్టీ
1967 శివరావు షెట్కర్ కాంగ్రెస్ పార్టీ ఏ.ఆర్.కె.ఆర్.పటేల్ స్వతంత్ర అభ్యర్థి
1972 మహారెడ్డి వెంకట్ రెడ్డి స్వతంత్ర అభ్యర్థి శివరావు షెట్కర్ కాంగ్రెస్ పార్టీ
1978 శివరావు షెట్కర్ ఇందిరా కాంగ్రెస్ మహారెడ్డి వెంకట్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
1983 మహారెడ్డి వెంకట్ రెడ్డి తెలుగుదేశం పార్టీ శివరావు షేట్కర్ కాంగ్రెస్ పార్టీ
1985 శివరావు షేట్కర్ కాంగ్రెస్ పార్టీ మహారెడ్డి వెంకట్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1989 పటోళ్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్ మహారెడ్డి వెంకట్ రెడ్డి తెలుగుదేశం పార్టీ
1994 మహారెడ్డి విజయపాల్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ పటోళ్ల కృష్ణారెడ్డి ఇండిపెండెంట్
1999 పటోళ్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ మహారెడ్డి విజయపాల్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ
2004 సురేష్ కుమార్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీ మహారెడ్డి విజయపాల్‌రెడ్డి తెలుగుదేశం పార్టీ
2009 పటోళ్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ మహారెడ్డి విజయపాల్‌రెడ్డి ప్రజారాజ్యం పార్టీ
2014 పటోళ్ల కృష్ణారెడ్డి కాంగ్రెస్ పార్టీ మహారెడ్డి విజయపాల్‌రెడ్డి తెరాస
2016 (ఉప ఎన్నిక) మహారెడ్డి భూపాల్‌ రెడ్డి తెరాస పట్లోళ్ల సంజీవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ
2018 మహారెడ్డి భూపాల్‌ రెడ్డి తెరాస సురేష్ కుమార్ షెట్కర్ కాంగ్రెస్ పార్టీ
2023[3] పట్లోళ్ల సంజీవ రెడ్డి కాంగ్రెస్ పార్టీ మహారెడ్డి భూపాల్‌ రెడ్డి భారత రాష్ట్ర సమితి

2009 ఎన్నికలు

[మార్చు]

2009 శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గం నుండి కాంగ్రెస్ పార్టీ తరఫున కృష్ణారెడ్డి పోటీచేయగా, మహాకూటమి తరఫున పొత్తులో భాగంగా తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీకి చెందిన ఎస్.భూపాల్ రెడ్డి పోటీపడ్డాడు. ప్రజారాజ్యం పార్టీ తరఫున విజయపాల్ రెడ్డి, భారతీయ జనతా పార్టీ నుండి అమర్ సింగ్ పవార్ పోటీచేశారు.[4]

2014ఎన్నికలు

[మార్చు]

2014 లో జరిగిన ఆంధ్రప్రదేశ్ శాసనసభ ఎన్నికలలో ఈ నియోజకవర్గములో భారత జాతీయ కాంగ్రెస్ తరపున పోటీచేసిన ప.కిష్టా రెడ్డి తన సమీప ప్రత్యర్థియు తె.రా.స అభ్యర్థియునైన మ.భూపాల్ రెడ్డిపై 14746 ఓట్ల తేడాతో గెలుపొందిరి. ఆ ఎన్నికలలో ప.కిష్టారెడ్డికి 62,347 ఓట్లు, మ.భూపాల్ రెడ్డీకి 47,601 ఓట్లు లభించినవి. 2015 ఆగస్టు 25 నాడు ప.కిస్టారెడ్డి గుండెపోటుతో మరణించారు.

2016 ఉప-ఎన్నిక

[మార్చు]

నారాయణ్‌ఖేడ్ నియోజకవర్గ శాసనసభ సభ్యుడు ప.కిష్టారెడ్డి మృతితో ఖాళీయైన ఈ నియోజకవర్గమునకు 2016 ఫిబ్రవరి 13 నాడు ఉప ఎన్నిక నిర్వహింపబడెను. ఆ ఉప-ఎన్నికలో అధికార తె.రా.స.కు చెందిన మ.భూపాల్ రెడ్డి గెలుపొందిరి.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Andhrajyothy (17 November 2023). "ఖేడ్‌లో ఢీ అంటే ఢీ". Archived from the original on 21 December 2023. Retrieved 21 December 2023.
  2. Eenadu (15 November 2023). "శాసనసభ బాట పట్టారిలా." Archived from the original on 15 November 2023. Retrieved 15 November 2023.
  3. Eenadu (8 December 2023). "తెలంగాణ ఎన్నికల్లో విజేతలు వీరే". Archived from the original on 8 December 2023. Retrieved 8 December 2023.
  4. సాక్షి దినపత్రిక, తేది 09-04-2009