బాగ్‌పత్
బాగ్‌పత్ | |
---|---|
పట్టణం | |
Coordinates: 28°57′N 77°13′E / 28.95°N 77.22°E | |
దేశం | భారతదేశం |
రాష్ట్రం | ఉత్తర ప్రదేశ్ |
జిల్లా | బాగ్‌పత్ |
Elevation | 253 మీ (830 అ.) |
జనాభా (2011)[1] | |
• Total | 50,310 |
భాషలు | |
• అధికారిక | హిందీ[2] |
Time zone | UTC+5:30 (IST) |
Website |
బాగ్‌పత్ ఉత్తర ప్రదేశ్‌లోని పట్టణం. ఇది బాగ్‌పత్ జిల్లా ముఖ్య పట్టణం. ఇది జాతీయ రాజధాని ప్రాంతంలో భాగం. [3]
నగరానికి అసలు పేరు పురాణాల్లో పేర్కొన్న వ్యాఘ్రప్రస్థం. పెద్ద సంఖ్యలో పులులుండే ప్రాంతం కాబట్టి దీనికి ఆ పేరు వచ్చిందని ప్రతీతి. [4] మహాభారతంలో కూడా దీన్ని వ్యాఘ్రప్రస్థం అని ప్రస్తావించారు. భారత యుద్ధాన్ని నివారించడానికి, పాండవుల తరపున కృష్ణుడు కోరిన ఐదు గ్రామాలలో ఇది ఒకటి. [5]
మొఘలుల కాలంలో, నగరం లోని ఉద్యానవనాలను సూచిస్తూ దీనికి బాగ్‌పత్ (బాగ్ అంటే హిందూస్థానీలో తోట అని అర్థం) అని పేరు పెట్టారు. [6]
భౌగోళికం
[మార్చు]బాగ్‌పత్ పశ్చిమ ఉత్తరప్రదేశ్‌లో, యమునా నది తూర్పు ఒడ్డున ఉంది. ఇది ఢిల్లీ నుండి ఈశాన్యంగా 40 కి.మీ. మీరట్ నుండి పశ్చిమంగా 52 కి.మీ. దూరంలో, ఢిల్లీ- సహారన్‌పూర్ రహదారిపై ఉంది. బాగ్‌పత్ జిల్లాకు ఉత్తరాన షామ్లీ, ముజఫర్‌నగర్ జిల్లాలు, తూర్పున మీరట్ జిల్లా, దక్షిణాన ఘాజియాబాద్ జిల్లా, పశ్చిమాన యమునకు ఆవల, ఢిల్లీ, హర్యానా లోని సోనీపత్ జిల్లాలు ఉన్నాయి. [3]
జనాభా
[మార్చు]2011 భారత జనగణన ప్రకారం, బాగ్‌పత్‌లోని 7880 గృహాల్లో 50,310 జనాభా ఉంది, అందులో 26,435 మంది పురుషులు, 23,875 మంది మహిళలు. 8,781 మంది ఆరేళ్ళ లోపు పిల్లలున్నారు. బాగ్‌పత్‌లో అక్షరాస్యత రేటు 50.7%, పురుషుల అక్షరాస్యత 56.9%, స్త్రీ అక్షరాస్యత 43.8%. బాగ్‌పత్ లో ఏడేళ్ళకు పైబడీన వయసున వారిలో అక్షరాస్యత 61.43% కాగా, ఇందులో పురుషుల్లో అక్షరాస్యత 68.9%, స్త్రీలలో 53.1% ఉంది. షెడ్యూల్డ్ కులాల జనాభా 2,337.[1]
ప్రముఖ వ్యక్తులు
[మార్చు]- సత్యపాల్ మాలిక్, రాజకీయ నాయకుడు
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 "Census of India: Baghpat". censusindia.gov.in. Retrieved 13 December 2019.
- ↑ "52nd REPORT OF THE COMMISSIONER FOR LINGUISTIC MINORITIES IN INDIA" (PDF). nclm.nic.in. Ministry of Minority Affairs. Archived from the original (PDF) on 25 మే 2017. Retrieved 23 నవంబరు 2020.
- ↑ 3.0 3.1 "About District". bagpat.nic.in. Retrieved 7 March 2020.
- ↑ "इतिहास". bagpat.nic.in (in హిందీ). Retrieved 2 September 2020.
- ↑ The cities of Delhi. Jain, Ashok Kumar. Management Pub. Co. 1994. ISBN 978-81-86034-00-2.
- ↑ Cotton, James Sutherland; Burn, Sir Richard; Meyer, Sir William Stevenson (1908). The Imperial Gazetteer of India: Argaon to Bardwān (in English). Clarendon Press. p. 190.
{{cite book}}
: CS1 maint: unrecognized language (link)