ఇరావతీ కర్వే
ఇరావతీ కర్వే | |
---|---|
జననం | ఇరావతీ కర్వే డిసెంబరు 15, 1905 |
మరణం | ఆగష్టు 11, 1970 |
ఇతర పేర్లు | ఇరావతీ కర్వే |
ప్రసిద్ధి | ఆంథ్రాపాలజిష్టు విద్యావేత్త రచయిత |
పిల్లలు | ఆనంద్ , నందిని నింబాకర్ గౌరీ దేశ్ పాండే |
తండ్రి | జి.హెచ్.కర్మాకర్ |
ఇరావతీ కర్వే (హిందీ :इरावती कर्वे; డిసెంబరు 15, 1905 – ఆగష్టు 11, 1970) భారత దేశానికి చెందిన ఆంథ్రాపాలజిష్టు. ఈమె విద్యావేత్త, రచయిత. ఈమె భారత దేశంలో మహారాష్ట్రకు చెందినవారు. ఈమె బర్మా దేశానికి చెందిన ఇంజనీరు జి.హెచ్.కర్మాకర్ కు జన్మించారు. ఈమెకు బర్మాకు చెందిన పవిత్ర నది "ఇరావతీ" పేరు పెట్టారు. ఈమె భారతదేశంలోని పూనాలో పెరిగారు.
విద్యా విషయాలు
[మార్చు]కర్వే 1928 లో ముంబయి విశ్వవిద్యాలయం నుండి సోషియాలజీలో మాస్టర్స్ డిగ్రీ తీసుకున్నారు. 1930 లో జర్మనీ లోని బెర్లిన్ లో గల విశ్వవిద్యాలయం నుండి ఆంథ్రోపాలజీలో డాక్టరేట్ డిగ్రీ అందుకున్నారు.కార్వే భారతదేశం లోని పూనే నగరంలో గల దక్కన్ కాలేజి పోష్ట్ గ్రాడ్యుయేత్, రీసెర్చ్ ఇనిస్టిట్యూట్ (దక్కన్ కాలేజీ) లోని ఆంధ్రాప్లాజీ, సోషియాలజీ విభాగాలకు అధిపతిగా అనేక సంవత్సరాలు ఉన్నారు.
ఆమె న్యూఢిల్లీలో 1947 లో జరిగిన జాతీయ సైన్స్ కాంగ్రెస్ ఆంత్రోపాలజీ విభాగానికి అధ్యక్షత వహించారు.
ఈమె సోషియాలజీ, ఆంథ్రోపాలజీ విభాగాలలో పలు అంశాలను మరాఠీ, ఆంగ్ల భాషలలో వ్రాసారు.
రచనలు
[మార్చు]- ఇరావతీ కర్వే రచనలు
- హిందూ సొసైటీ -వివరణ (1961) (ఆంగ్లం :Hindu Society - an interpretation (1961) ) : ఈ గ్రంథంలో కర్వే తన క్షేత్ర పర్యటనలలో హిందూ సమాజం పై అధ్యయనం చేసి సేకరించిన అంశాలు పొందుపరచబడ్డాయి. ఆమె హిందీ, మరాఠీ, సంస్కృతం, పాలీ, ప్రకృతి భాషలలో గల గ్రంథాలను అధ్యయనం చేసి వ్రాయబడిన గ్రంథము. ఇందులో హిందూమతంలో ఆర్యుల రాక పూర్వము గల కుల వ్యవస్థ గూర్చి చర్చించడం జరిగింది.
- కిన్‌షిప్ ఆర్గనైజేషన్ ఇన్ ఇండియా (1953) (ఆంగ్లం :Kinship Organization in India (1953) ) : భారతదేశములోని వివిధ సంస్థల గూర్చి అధ్యయనం గూర్చి
- మహారాష్ట్ర - లాండ్ ఆఫ్ పీపుల్ (1968) (ఆంగ్లం: :Maharashtra -Land and People (1968) ) : మహారాష్ట్ర లోని వివిధ ఆచారాలు, సామాజిక సంస్థల గూర్చి
- యుగాంతం (ఆంగ్లం :Yuganta : మహాభారతం లోని ముఖ్య పాత్రల గూర్చి అధ్యయనం గూర్చి వ్రాయబడిన గ్రంథం. ఇందులో చారిత్రక వ్యక్తుల వారి ప్రవర్తన, వైఖిరులను గూర్చి అర్థం చేసుకోవడానికి ఉపయోగపడే అంశాలున్నాయి. ఈ గ్రంథాన్ని కర్వే మరాఠీ భాషలో వ్రాశారు. ఆ తర్వాత ఆంగ్లంలో అనువాదం చేయబడింది.దీనికి 1968 లో సాహిత్య అకాడమీ బహుమతి వచ్చింది. ఈ రచన పురుషభారత ప్రభావాలకు దూరంగా మహాభారతాన్ని స్త్రీ పరంగా, స్త్రీవాదపరంగా వ్యాఖ్యానించింది.
- పరిపూర్తి (మరాఠీ)
- భోవర (మరాఠీ)
- ఆమచి సంస్కృతి (మరాఠీ)
- సంస్కృతి (మరాఠీ)
- గంగాజల్ (మరాఠీ)
కుటుంబం
[మార్చు]కర్వే మహర్షి దోండో కేశవ్ కార్వే యొక్క మనుమరాలు. ఈమె భర్త దినకర్ ఒక విద్యావేత్త, ఫెర్గుసన్ కాలేజీకి ప్రిన్సిపాల్ గా యున్నారు. ఈమె కుమారుడు ఆనంద్ పూనేలో ఎన్.జి.ఓను నడుపుతున్నారు. ఇది "ఆర్తి"గా పిలువబడుతున్నది. ఆమె చిన్న కుమార్తె "గౌరీ దేశ్ పాండే" మరాఠీ రచయిత, లఘు కథల రచయిత. ఈమె పెద్ద కుమార్తె జై నింబాకర్ ఫల్టాన్ లో నివసిస్తున్నారు. ఈమె కూడా నవలా, కథా రచయిత. జై నింబాకర్ యొక్క కుమార్తె నందిని నింబాకర్ యు.ఎస్.ఎ లోని ప్లోరిడా విశ్వవిద్యాలయంలో వ్యక్తి. ఆనంద్ యొక్క కుమార్తె ప్రియదర్శినీ కర్వే 1991 నుండి గ్రామీణ ప్రాంతాలో బయోమాస్ శక్తి సంకేతికత అభివృద్ధికి కృషిచేస్తున్నారు.
సూచికలు
[మార్చు]ఇతర లంకెలు
[మార్చు]మూలాలు
[మార్చు]- లీలావతి కూతుళ్ళు
- Wikipedia articles with VIAF identifiers
- Wikipedia articles with LCCN identifiers
- Wikipedia articles with ISNI identifiers
- Wikipedia articles with GND identifiers
- Wikipedia articles with BNF identifiers
- Wikipedia articles with BIBSYS identifiers
- Wikipedia articles with NLA identifiers
- Wikipedia articles with SNAC-ID identifiers
- 1905 జననాలు
- 1970 మరణాలు
- మహారాష్ట్ర రచయితలు
- భారతీయ మహిళా శాస్త్రవేత్తలు